విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. లక్కబొమ్మలకు ప్రసిద్దిగాంచిన ఏటికొప్పాకలో జగన్ కు లక్కబొమ్మల కళాకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు. బొమ్మల తయారీలో లక్క, విద్యుత్‌లో సబ్సిడీ కల్పించాలని కోరారు. చాలిచాలని సంపాదనతో కుటుంబాలు గడవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బొమ్మలకు గిట్టుబాటు ధరల కూడా లేదని, లక్కబొమ్మల తయారీ క్రరకూడా దొరకడం కష్టంగా ఉందని, ఫారెస్ట్ అధికారుల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని, లక్కబొమ్మల పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జననేతకు నవరత్నాలతో రూపొందించిన లక్క బొమ్మను బహుకరించారు. అది చూసిన జగన్ మురిసిపోయారు. తనకు విలువైన బొమ్మలకంటే ఇలా చేతివృత్తుల ద్వారా సహజసిద్ధంగా చేసిన బొమ్మలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. గతంలో ఈ లక్క బొమ్మల గురించి విన్నానని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక లక్కబొమ్మల పరిశ్రమను ఆదుకుంటానని, తయారీదారులకు అన్ని విధాల అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.