ప్రకృతి విలయంతో వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లక్ష రూపాయలు తమ వంతు గ ఆర్ధిక సహాయం చేసారు . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం , పౌష్టికాహారం ఇలా ఎన్నో రకాలుగా మానవతా దృక్పధం తో స్పందించడం తెలిసిందే .
కెసిఆర్ గారి పిలుపు మేరకు ప్రపంచం లో ని NRI లు స్పందించి తమ వంతుగా సహాయం చేయడం తెలంగాణ బిడ్డలుగా ఎంతో గర్వంగా ఉందని,ఇందుకు కెసిఆర్ గారికి ,అలాగే ఈ విరాళానికి ఆర్థిక సహాయం చేసిన డా అనిల్ రావు చీటీ , డా అర్జున్ చల్లగుళ్ళ , సాయిరా ఉప్పు లకు టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కృతజ్ఞతలు తెలిపారు .
తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికిని అభివృద్ధి , పరిపాలన తో పాటు పక్క రాష్ట్రాల తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించడం లో కూడా ముందు వరసలో నిలబడిందని, మిగతా రాష్ట్రాలు , విదేశాలలో ఉండే భారతీయులు కేరళ ను ఆదుకోవడానికి ముందుకు రావాలని, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల విన్నవించారు.