తెలుగు సినీ కామెడీ కింగ్, హాస్యబ్రహ్మా, దశాబ్దం పాటు దాదాపుగా విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించి, తనపాత్రకు న్యాయం చేసిన సీనియర్ నటుడు బ్రహ్మానందం.. కారణాలేవైనా ఇటీవల దర్శకులు, రచయితలు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు. దీంతో ఆయన బుల్లితెరపై దృష్టిపెట్టారు. ఛానెల్ స్టార్ మా, బ్రహ్మానందం వ్యాఖ్యాతగా ఒక కామెడీషో ప్లాన్ చేసింది. ఆయన నవ్వించగలిగే కామెడీ యాంగిల్ మీలో ఉంటే ఈ షోలో పాల్గొనండి అంటూ ఒక ప్రోమోను కూడ రిలీజ్ చేశారు. త్వరలో ఈ షో ప్రేక్షకులు ముందుకు రానుంది. సో ఇకనుంచి బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఆ ప్రోమోలో కనిపించిన బ్రహానందం తనదైన శైలిలో పంచ్‌లు వేసి కామెడీ పండించారు. దీనిని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మీ కామెడీని ఇక ఇంట్లోనే చూడొచ్చని అంటున్నారు. బ్రహ్మానందం ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరో సినిమాల్లో తప్ప చిన్న సినిమాల్లో నటించడం లేదు. త్వరలోనే టీవీ తెరపై కనిపించనున్న ఆయన ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. త్వరలోనే బ్రహ్మానందం ప్రతీ ఇంట్లోనూ రోజూ సందడి చేయనున్నారు. అయితే బ్రహ్మానందం పారితోషకం భారీగా పెంచడం వల్లే ఆయనకు అవకాశాలు తగ్గినట్టు వార్తలొస్తున్నాయి.
