కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హమీల సంగతి దేవుడేరుగు ..
తనని నమ్ముకోని పార్టీనే అంటిపెట్టుకోని ఉన్న నేతలకు ముఖ్యంగా సీనియర్ నేతలను నమ్మించి మోసం చేశాడు బాబు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎంపీగా వద్దు ఎమ్మెల్యేగా బరిలోకి దిగు .. గెలిచి రా మంత్రి పదవీ ఇస్తాను అని నమ్మబలికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మోసం చేశారు అని ఆయన అనుచరులు,టీడీపీ నేతలు ఇటివల బాహటంగానే ఆరోపణలు కూడా చేశారు . అయితే తాజాగా రానున్న ఎన్నికల్లో ఎన్ని హామీలిచ్చిన గెలవడం అసాధ్యమని భావించిన చంద్రబాబు నాయుడు తన అస్థాన మీడియా ద్వారా దాదాపు నలబై మంది సిట్టింగ్ ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి సీట్లు ఇవ్వడంలేదని బాబు ప్రచారం చేయించారు.
దీంతో ముందే మేల్కోన్న మోదుగుల సంచలన నిర్ణయం తీసుకున్నారు అని జిల్లా టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగా ఇన్నాళ్ళు మంత్రి పదవీ ఇస్తాను అని నమ్మించి మోసం చేయడమే కాకుండా ఏకంగా రానున్న ఎన్నికల్లో సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మోదుగుల త్వరలోనే వైసీపీ గూటికి చేరాలని డిసైడయ్యారు అంట. అయితే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గం నుండి అయిన కానీ లేదా మాచర్ల నుండైన కానీ లేదా ఎంపీగా కానీ బరిలోకి దిగుతా.. ఆప్షన్ మీదే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ,జిల్లా వైసీపీ నేతలకు సందేశామిచ్చారు అంట.
గతంలో జగన్ పాదయాత్ర సమయంలో కూడా ఆయన పార్టీ వీడ్తారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సీనియర్లకు టికెట్లు ఇచ్చేది లేదని బాబు తేల్చి చెప్పడంతో పార్టీలో ఉండటం కంటే వైసీపీలోకి పోవడం బెటరని మోదుగుల అనుచరులు,జిల్లా టీడీపీ నేతలు కూడా నచ్చచెప్పడంతో ఆయన పార్టీ మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంట. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే జగన్ పాదయాత్ర ముగిసే ఇచ్చాపురం లో భారీ బహిరంగ సభలో వైసీపీ కండువా కప్పుకోవడానికి మోదుగులు రెడీ అవుతున్నారు అని జిల్లా టీడీపీలో గుసగుసలు ..ఏది ఏమైన మోదుగుల లాంటి సీనియర్లు పార్టీ వీడటం టీడీపీకి గట్టి దెబ్బే..