2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చాల సార్ల్ చెప్పిన సంగతి తెలిసిందే. . అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. తన పోరాట యాత్రలో టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా అనేక సభల్లో పవన్ పై సెటైర్లు విసిరరుతూనే ఉన్నారు. రు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడ టీడీపీపై తీవ్రమైన ఆవేశంలో ఉన్నారంటా. ..అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనా గెలవలేకపోయిన పర్వాలేదు…మా నాయకుడు వల్ల అధికారంలోకి వచ్చి..మా నాయకుడినే తప్పు..తుప్పు అని అంటరా..ఖచ్చితంగా టీడీపీ మాత్రం రాకూడదు అని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో 2019 ఎన్నికల్లో జనసేనా ప్రధాన శత్రువు టీడీపీనే..అని స్ఫష్టంగా తెలుస్తుంది.
