ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు.
నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. భారత ఎమర్జన్సీ సమయంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు.1996లో ఐరాసకు వెళ్ళిన వారిలో ఒకరతను ..పలు పత్రికలకు “ఆప్-ఎడ్(ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) అనేక కాలమ్స్ ,రచనలు రాశారు. వీటిలో ద డైలీ స్టార్,ద సండే గార్డియన్ ,ద న్యూస్ పాకిస్తాన్,ద స్టేట్స్ మన్ ,ఎక్స్ ప్రెస్ ట్రిబూన్,డాన్ లాంటివి ప్రముఖమైనవి..తెలుగు పత్రికలకు కూడా ఆయన రాశారు..