కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు. అయితే ఒక పెద్ద మనిషి అయ్యివుండి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టి పోతుంటే..పట్టించుకోకుండా పోవడము అనేది ఇప్పుడు హాట్ గటాపిక్ గా మారింది.
