2013 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో చిక్కుకున్నవారిలో మాజీ బౌలర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించిన విషయం కూడా తెలిసిందే.ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై కూడా రెండేళ్ల పాటు నిషేధించారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో కీలక భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదం కోసం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలమైన విషయాలు వెల్లడించారు.
2011 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ టీం లో ఉన్న ఒక సీనియర్ ఆటగాడు పలువురు బూకీలతో సంబంధాలు ఉన్నాయని పెర్కున్నారు.. అయితే ఆ ఆటగాడి పేరు బయటపెట్టేందుకు మాత్రం మిశ్ర నిరాకరించారు.
విచారణలో భాగంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విచారించానన్న మిశ్రా…..‘2008- 09 నుంచే ఆ సీనియర్ ఆటగాడు బుకీలతో కాంటాక్ట్‌లో ఉన్నాడని భారత్ లో జరిగిన ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కి అతడు బూకీలతో మాట్లాడాడు అని. ఇందుకు సాక్ష్యంగా తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును నాకు ఇస్తానని ఆ బుకీ చెప్పాడని, కానీ చవరి నిమషంలోఅతను బయపడ్డాడని చెప్పారు. అయితే కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు, శ్రీనివాసన్, గురునాథ్ మయప్పన్, రాజ్‌కుంద్రా , సుందర్ రామన్ లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే నా యొక్క పని అని తెలిపారు.
