ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న18వ ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం పసికూన హాంకాంగ్‌పై జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడింది.పూల్-బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 26-0తో చిత్తుచిత్తుగా ఓడించగా… 86 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 1932, లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో లెజండరీ ప్లేయర్లు ధ్యాన్‌చంద్, రూప్ సింగ్, గుర్మీ సింగ్‌లతో కూడిన భారత జట్టు 24-1తో అమెరికాను మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే 1994లో న్యూజిలాండ్ 36-1తో సమోవాపై సాధించిన విజయమే ఇప్పటి వరకు అతిపెద్దది. భారత జట్టులో సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లుతో సహా.. మొత్తం 13 మంది ప్లేయర్లు గోల్స్ చేయడం విశేషం. రూపీందర్ సింగ్ ఐదు, హర్మన్ ప్రీత్ నాలుగు, ఆకాశ్‌దీప్ సింగ్ మూడు గోల్స్ నమోదు చేశారు.ఇలానే ప్రతి మ్యాచ్ గెలిచి బంగారు పథకం సాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.