Home / ANDHRAPRADESH / ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం ..
1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ సమాధానం ఇవ్వడం విచిత్రంగా ఉంది. అసలు 10.32 శాతం వడ్డీతో బాండ్లు ఎందుకు జారీ చేయాలన్నదే మా మౌలిక ప్రశ్న? మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తే ఇది 10.7 శాతం కంటే మించుతుందనేది వాస్తవమా? కాదా?

2 ముంబయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కి కమీషన్‌ ఇవ్వలేదని కుటుంబరావు పేర్కొన్నారు. కానీ, మర్చంట్‌ బ్యాంకర్‌కు 0.85 శాతం కమీషన్‌తోపాటు జీఎస్‌టీ కూడా చెల్లిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం జీవో ఎలా ఇచ్చింది? ఈ రకంగా కమీషన్‌ రూ.17 కోట్లు, జీఎస్‌టీ పన్నులతో కలిపి రూ.20 కోట్లు చెల్లించడం దుర్మార్గం కాదా?

3 బాండ్ల రూపంలో సేకరించిన రూ.2,000 కోట్లను ఆరో సంవత్సరం నుంచి వెనక్కి ఇవ్వడం ప్రారంభిస్తే, మీరు అనుమతించిన విధంగా అదే సంవత్సరం పెట్టుబడిదారులందరూ తమకు 20 శాతం వెనక్కి ఇవ్వాలని అడగవచ్చు కదా? ఇది నిజమా కాదా?

4 రూ.2,000 కోట్లకు రూ.1,573 కోట్లు ‘మాత్రమే’ వడ్డీ కడుతున్నామనడం దారుణం కాదా? రాష్ట్ర ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే పన్నుల నుంచి రూ.1,573 కోట్లు వడ్డీ చెల్లించడం మీకు ఆషామాషీగా కనిపిస్తోందా? ఈ అప్పు ద్వారా లాభం పొందేది ఎవరు? ఎన్నికలు ఆరు నెలలు కూడా లేని హడావుడిగా చేస్తున్న ఈ అప్పులకు రెండు మూడు తరాలు అసలూ వడ్డీలూ కట్టాలా? ఇలాంటి వడ్డీలతో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్మించవచ్చో ఎప్పుడన్నా ఆలోచించారా?

5 ప్రస్తుతం ఉన్న జనంపైనా, రాబోయే తరాలపైనా నిప్పుల కుంపటి లాంటి అప్పులను మూటగట్టి పెడతున్నారు. ఇలా మీరు కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం న్యాయమేనా?

6 అప్పు తీసుకోవడానికి ఎలాంటి విధానం అనుసరించాలో వివరిస్తూ మీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసిన చేసిన జీవో 65లో ఏం చెప్పారు? 8 శాతంలోపు వడ్డీ అయితేనే హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పన్ను రాయితీ వర్తించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లను కేవలం 6 శాతం వడ్డీరేటుతో విడుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. మరి దీనికి విరుద్దంగా 10.7 శాతం వడ్డీ చెల్లించేలా అమరావతి బాండ్లు జారీ చేశారంటే ఏమనాలి? గోల్‌మాల్‌ అనకుండా గొప్పతనం అంటారా?

7 రుణం కోసం హడ్కోను మీరు ఎందుకు సంప్రదించలేదన్నది మా ప్రశ్న కాదు. ఇంత భారీ వడ్డీ రేటుకు ఎక్కడ వీలుంటే అక్కడ ఎందుకు అప్పు చేస్తున్నారన్నదే మా ప్రశ్న.ప్రభుత్వాలకు బ్యాంకుల నుంచి ఇంతకంటే తక్కువ వడ్డీకే అప్పు లభిస్తున్నప్పుడు భారీ వడ్డీ రేటుకు బాండ్లు జారీ చేశారంటే కచ్చితంగా ఎవరికో ప్రయోజనం కలిగించేందుకు పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారని మాతోపాటు ప్రజలూ అనుమానిస్తున్నారు. అని ఆయన మీడియా సాక్షిగా బాబు సర్వారును నిలదీశారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat