భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన మరిచిపోకముందే తాజాగా చత్తీస్ గడ్ లో మాజీ ప్రధాని అటల్ సంతాప సభలో బీజేపీ మంత్రులు కామెడీ జోకులు వేసుకుంటూ ఇకఇకలు పకపకలు అవుతున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది..
రాయ్ పూర్ లో జరిగిన సంతాప సభకు హాజరైన వారంతా తీవ్ర విషాణ్ణవదనంతో నివాళులర్పించారు. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అజయ్ చంద్రకర్,వ్యవసాయ శాఖా మంత్రి బ్రిజమోహన్ అగర్వాల్ బిగ్గరగా నవ్వుతూ సంతాప సభను అపహాస్యంపాలు చేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే మంత్రుల తీరుపై అటల్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు..