ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..NTR టీడీపీ పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ పార్టీ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో మేము చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి వస్తే.. అంతకంటే దుర్మాగ్గపు పని మరొకటి ఉండదని అయన మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్తం చేశారు . అయితే ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే, మొదటగా దాన్ని వ్యతిరేకించేది తానేనని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారని తాను అనుకోవటం లేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే..మనల్ని మనమే క్షమించుకోలేమని అన్నారు. అయితే అయన చేసిన వాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.ఈ క్రమంలోనే అయన పార్టీ మారుతునట్లు వార్తలు వాస్తున్నాయి.