వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్ట్రాటజీతో ముందుకెళ్తుందని చెప్పుకోవాలి.. జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు కదులుతుంటే ఆప్రాంతంలోని వైఎస్సార్సీపీ నేతలు ఆ ప్రాంత టీడీపీ నాయకుల భరతం పడుతున్నారు. స్థానికంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇవే అంశాలను జగన్ పాదయాత్ర సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డీవీ సూర్యనారాయణ రాజు దుయ్యబట్టారు. అనితకు ఇసుక మాఫియాకు సంబంధం లేదు అని ఖండించే కనీస ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అనితతో బాటు, మంత్రి అయ్యన్న కూడా అక్రమ ఇసుకతోనే ఇల్లు కట్టుకున్నారని, వీరిద్దరూ కోట్లు సంపాదించారన్నారు. తమవద్ద అనిత, అయ్యన్న ఇసుక మాఫియాపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఓ వైపున నిత్యం ప్రభుత్వాన్ని చంద్రబాబును ఏకిపారేస్తున్న జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను కూడ గట్టడంతోపాటు స్థానిక టీడీపీ నేతల అవినీతిని బయటపెడుతూ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నవిధంగా ముందుకెళ్తున్నారు.
