గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వవైద్యశాలలో పాము కాటు రోగులతో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది.. గత నాలుగు రోజులగా వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పాముకాటు బారిన పడి 30మంది హాస్పిటల్ కు పరుగెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. గత మూడ్రోజులుగా హాస్పిటల్ లో చేరిన పాము కాటు రోగులంతా సురక్షితంగానే ఉన్నారని తెలియజేసారు. ప్రభుత్వ వైద్యశాలలో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ప్రజలు పాముకాటుకు గురైన వెంటనే నాటు వైద్యులను సంప్రదించకుండా సకాలంలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ప్రాణాపాయం తప్పుతుంది అన్నారు. అలాగే కరచినది ఏ జాతి పామో తెలియజేస్తే వైద్యం మరింత సులభతరమవుతుంది అన్నారు. అయితే మొత్తమ్మీద అమరావతిలో జరుగుతున్న ఈ పాముల గొడవపై పెద్ద దుమారమే రేగుతోంది.
