రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS రెవిన్యూశాఖ వద్ద నిధులు లేవని ఈ ఆఫీసును కనీసం మరమ్మత్తులు కూడా చేయించకుండా వదిలేసారు. చాలా విలువైన భూ రికార్డులు, చాలా విలువైన, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలన్నీ ఇందులో ఉంటాయి. వర్షాలకో, గాలులలకో ఈ ఆఫీస్ అకస్మాత్తుగా కూలిపోతే రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎంతోకాలంగా బధ్రతపర్చిన చాలా విలువైన ఆస్థుల రికార్డుల పరిస్థితి ఏంటి.? వాటికి బాధ్యులెవరు. మంగళగిరి మున్సిపల్ అధికారులు లేక రెవిన్యూ శాఖ నిర్లక్ష్యానికి ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందీ ఉదాహరణ..
