కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్యానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం రేగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని పలు కారణాలు వెల్లడించాడు. పురుగులమందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న వీరలంకయ్యకు టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అండగా ఉన్నారు. వారినుంచి నాకు ప్రాణహాని ఉంది. నామరణంతోనైనా క్రీడాకారులకు న్యాయం జరుగాలని ఆశిస్తున్నానంటూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కబడ్డీఅసోసియేషన్‌లో అలజడి రేపుతోంది.
అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ గతంలో కొందరు క్రీడాకారిణులను మీడియా ముందుకు వచ్చారు. రెండు దశాబ్దాలుగా ఏపీ కబడ్డీ అసోసియేషన్‌లో పాతుకుపోయిన వీరలంకయ్య డబ్బులకు అమ్ముడుపోయి, అసలైన ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మహిళ ప్లేయర్లు ఆరోపించారు. ఒక లెటర్ కావాలంటే దానికి ఏం చేయగలవు అంటూ వీరలంకయ్య అడిగేవారని ఓ మహిళ కబడ్డీ ప్లేయర్ చెప్పారు. అవకాశాలిచ్చేందుకు లైంగికంగా వేధించారని, డబ్బులు ఇవ్వకపోతే చెప్పిన చోటుకురావాలంటూ వీరలంకయ్య వేధిస్తున్నారని ధనలక్ష్మీ అనే క్రీడాకారిణి ఆరోపించారు. ప్రతి ఏడాదీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను వీరలంకయ్య బయటివారికి అమ్ముకుంటున్నారని, మహిళలు అనే గౌరవం లేకుండా అందరిముందు వీరలంకయ్య అసభ్యంగా మాట్లాడతారని గౌతమి అనే క్రీడాకారిణి చెప్పారు. క్యాంపులకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. అనంతరం వీరలంకయ్యపై జిల్లా కబడ్డీ క్రీడాకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే క్రీడాకారిణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో దీంతో వీరలంకయ్య కోర్టులో లొంగిపోయారు. అనంతరం వీరలంకయ్యను సబ్ జైలుకు తరలించారు.
అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అండతో బయటకు వచ్చిన వీరలంకయ్య మరింత చెలరేగిపోయారు. ఆయనను ఆంధ్రా క్రికెట్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలగించకపోడం.. అన్ని ఆరోపణలు అయిపోవడంతో వీరలంకయ్య క్రీడాకారులను మరింత వేధించసాగాడు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ క్రీడాకారిణులకు అండగా ఉంటున్నాడని దాదాపుగా 40మంది అమ్మాయిలను అడ్డుకుంటూ వారికి రావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఆ సర్టిఫికెట్లు వేరే వాళ్లకు అమ్ముకుంటూ, వీరికి ఉద్యోగాలు రానివ్వకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో చాలామంది కబడ్డీకి కూడా దూరమయ్యాడు.. ఇటువంటి దారుణమైన వ్యక్తిని కేఈ ప్రభాకర్ అండగా ఉండడం వారి అవినీతికి అద్దం పడుతోంది. ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన చావుతోనైనా క్రీడాకారిణులకు న్యాయం చేయాలంటూ శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.