తెలుగుదేశం పార్టీ అదినేత మఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందస్తుగానే వచ్చే ఎన్నికలలో పోటీచేసే 40 మంది అభ్యర్ధులను ప్రకటిస్తారని టీడీపీ అనూకుల మీడియాలో ఒక వార్త వచ్చింది. రాఫ్ట్రా వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాలలో అభ్యర్దులను ప్రకటించాలన్నదానిపై ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రస్తుత సిటింగ్‌లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోందని చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. సీఎం పలుమార్లు పిలిపించి మాట్లాడినప్పటికీ ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించిందని ఆ కథనం సారంశం. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వరట.రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి నలభై మందిని మార్చవచ్చట. ఇప్పుడు ఈ వార్తతో టీడీపీ నేతల్లో , నియోజకవర్గాలుగా కార్యకర్తల్లో చర్చలు మొదలైయినట్లు తెలుస్తుంది.
