ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు . నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో షాపుల నిర్వాహకులెవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, అంతా తామే చెల్లిస్తామని గంభీరపు ప్రకటనలిచ్చి.. ఏడాది దాటినప్పటికీ వేలం సొమ్ము మాత్రం మునిసిపాలిటీ ఖజానాకు చేరలేదు. పైగా మార్కెట్ వేలం మొత్తం సొమ్ము చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తే.. చెల్లని చెక్కులు ఇచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. వేలంపాట రూ.76.12 లక్షలతో పాటు అగ్రిమెంట్, వడ్డీ రూ.15 లక్షలు, సర్వీస్ చార్జీ రూ.13.70 లక్షలతో కలిపి.. మొత్తం రూ.కోటి నాలుగులక్షల 82వేలు చెల్లించాల్సి ఉండగా.. టెండరు వేసే సమయంలో డిపాజిట్ కింద రూ.16 లక్షలు చెల్లించారు.
డిపాజిట్ తీసివేస్తే రూ.88.82 లక్షలు చెల్లించాలి. అయితే, రూ.60 లక్షల విలువ చేసే చెక్కులు కాస్తా బౌన్స్ అయినప్పటికీ కేసులు పెట్టకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ముందు వ్యాపారస్తులపై ప్రేమ కురిపించిన అధికారపార్టీ నేతలు తర్వాత మొహం చాటేశారు. ఇదే తరుణంలో మార్కెట్ వ్యాపారస్తుల నుంచి అద్దెల వసూలుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే తమను చెల్లించమంటే చెల్లించేవారమని, ఈ విధంగా చేతులెత్తేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. అంతేకాదు అపద్దపు హమీలు ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నారు..ఇప్పుడు మేము మోస పోయాం..కాని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒక్క ఓటు కూడ వేయాం అంటున్నారు నంద్యాల ప్రజలు.