తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం నెలకొంది.కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం గుదేపోటు తో మృతి చెందరు.కరీంనగర్ నగరం శివారులోని రేకుర్తి వంతెన వద్ద ప్రభాకర్‌కు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గామధ్యలోనే మృతి చెందారు. మార్నింగ్ వాక్‌కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రభాకర్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
