ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోమవారం పాదయాత్రలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్లలో టీడీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం స్పందించారు. ఆరోపణలపై దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్‌కు ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ధూమారం రేపుతున్నాయి.
