తెలుగు సినిమా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వేల సంఖ్యలో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు, నటీనటులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. అయితే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చారు. అంతే.. తమ్ముడి రాకతో చిరు కళ్లల్లో ఆనందం విరబూసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట.. పవన్ భార్య చేతుల్లో ఉన్న కొడుకు చిరంజీవిని చూస్తూ ఆ.. ఆ.. సైగలు చేయడంతో చిరంజీవి చాలా సంతోషపడ్డారట.. తమ్ముడి కొడుకుని చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతూ చిరంజీవి మైమరిచిపోయారు. పవన్ భార్య అన్నా లెజెనోవాతోనూ చిరు ముచ్చటించారు. కుటుంబ సభ్యులంతా మాట్లాడుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఏవిధమైన రాజకీయ, సామాజిక చర్చలు జరగలేదని, ఆసమయంలో చిరు ఇంట్లో కొందరు సినీ పెద్దలు, సన్నిహితులు ఉన్నట్టు తెలుస్తోంది