ఆంద్రప్రదేశ్ లో 2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు చాలమంది పార్టీలో చేరారు. తాజాగా విశాఖ జిల్లాలో కొనసాగుతున్నపాదయాత్ర శిబిరంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రేమ్‌బాబు పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోని వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని, ఖచ్చితంగా ఏపీకి జగన్ ను ముఖ్యమంత్రి చేస్తామన్నారు.
