కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేసారు. గత ఎన్నికలలో చంద్రబాబు అనేక పార్టీలను పెళ్లి చేసుకుని ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు గతంలో పెళ్లి చేసుకున్న పార్టీలను వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇంకా గత ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ..అమలు చేయ్యలేని 600 అపద్దపు హమీలు ఇచ్చాడని , నాలుగేళ్ళుగా ఐదున్నరకోట్ల ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్న కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిగ్గులేకుండా పాలిస్తున్నాడు. బాబుకు సిగ్గులేని చంద్రబాబు అనే బిరుదునివ్వచ్చు అని ఆయన సరికొత్త బిరుదునిచ్చారు. ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నారు.. వదిలేశారు. టీఆర్ ఎస్ – సీపీఐ – సీపీఎం – ఆఖరికి జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.
