ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని లోపాలను ఎండగడుతూ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఓట్లర్లను అడుగుతున్నాడు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లాలో పర్యటిస్తూన్నాడు. ఎక్కడ చూసిన ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో , అడుగు వేస్తున్నారు. అయితే పాదయాత్రలో జగన్ కు స్వాగతం పలకడానికి వైఎస్‌ఆర్‌సీపీ జెండాలను అలంకరించి..వందల మంది మహిళలు వైసీపీ పార్టీ గుర్తులతో ఉండే చీరలు ధరించి ..వారి తలపై ఒక కుండ పెట్టుకోని సందేశాత్మక స్వాగతం పలికారు.
మరో పక్క యువకులు భారీ సంఖ్యలో జగన్ పై అభిమానంతోనే కిలోమీటర్ వరకు గుమ్మడి కాయలతో స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయ చరిత్రలోనే మొదటి సారి….ఇంతకముందు ఎవ్వరికి జరగలేదు… అభిమానానికి హాద్దులు లేవు…ఇలాంటి సందేశాత్మక స్వాగతం…ఇంతకు మునుపు ఎవ్వరికి జరగలేదు ..జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా? అంటు కామెంట్స్ పెడుతున్నారు.