ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజం జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మాములుగా ఈనెల 22నే పండుగను జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అయితే వాస్తవానికి బక్రీద్ పండుగ ఈనెల 22నే ఉంటుందని ముందు ప్రకటించినప్పటికీ…తర్వాత దాన్ని 23కు మార్చారు. అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ 22నే జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బక్రీద్ సెలవు బుధవారమేనని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది.