Home / SLIDER /  అందరినోట ఒకటే మాట..ఈసారి కూడా మళ్ళీ కేసీయారే సీఎం

 అందరినోట ఒకటే మాట..ఈసారి కూడా మళ్ళీ కేసీయారే సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల విషయంలో ఎవ్వరిని అడిగినా ఒకటే మాట . ఈ సారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీయారే సీఎం . ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రైవేట్ సంభాషణల్లో ఇదే మాట చెబుతున్నరు . తెలంగాణలో అత్యధిక శాతం మంది ప్రజలది దాదాపుగా ఇదే అభిప్రాయం . ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని సర్వేల్లో అధికార టి ఆర్ ఎస్ పార్టీకి వంద సీట్లకు తక్కువ రావని తేలింది . ప్రజలు అత్యధిక శాతం మంది ఈ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రధాన కారణం తెలంగాణ రథసారధి , గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వారికి ఉన్న అభిమానమే . తెలంగాణ తెచ్చింది … ఇప్పుడు రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తున్నది కేసీఆర్ అనే అభిప్రాయం అందరిలో ఉంది . తెలంగాణ అభివృద్ధి పూర్తిగా గాడిలో పడాలంటే కేసీఆర్ సారథ్యంలోనే ప్రభుత్వం నడవాలనేది తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే మేధావులు , విద్యావంతులు , విభిన్న వర్గాల ప్రజల అభిప్రాయం . ఎందుకంటే 58 ఏళ్ళ సమైక్య పాలనకు , 50 నెలల కేసీఆర్ పాలన కు గల తేడా ఏమిటనేది ప్రజలకు పూర్తి స్థాయిలో అర్ధమయ్యింది . అధికారానికి దూరమయ్యి తట్టుకోలేక విలవిల్లాడుతూ ఫ్రస్టేషన్ తో తప్పుడు ప్రచారాలు చేస్తూ వాటి పునాదుల మీద గోడ కడుతున్న ప్రతిపక్షాలను ప్రజలు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా అర్ధమవుతున్నది .

ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని , అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలు ఇప్పుడు మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నయి . కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతున్నది . పేద , మధ్య తరగతి ప్రజలు , రైతులు , కార్మికులు , పల్లె వృత్తుల మీద ఆధారపడిన వివిధ వర్గాల ప్రజలు ఇలా అన్ని రంగాల వారికి అండగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానం ఉండడం తెలంగాణ ప్లస్ పాయింట్ . 24 గంటల విద్యుత్తు , ఆసరా పెన్షన్లు , కళ్యాణ లక్ష్మి , రైతు బంధు , రైతు భీమా , వ్యవసాయానికి ఉచిత విద్యుత్ , రేషన్ బియ్యం , ఆరోగ్యశ్రీ , ఫీజు రీ అంబర్స్ మెంట్ , హాస్టళ్లకు సన్న బియ్యం , ఉద్యోగ నియామకాలు , అంగన్ వాడీ , ఆశ ,మున్సిపల్ , కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మూడు వందల పైనే పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది .

ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ లో ప్రభుత్వం నుండి ప్రతి కుటుంభానికి ఏదో ఒక ప్రయోజనం అందుతూనే ఉంది . ఎవ్వరిని అడిగినా కేసీఆర్ ను చూసే ఓటు వేస్తామని చెబుతున్నరు . ప్రతిపక్షాల వాళ్ళు చేసే చిల్లర ప్రచారాలను పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు . ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రజలు ఎంత సంతోషంగ ఉన్నరో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల విషయంలో అంతగా భయపడుతున్నరు . మర్చిపోయి కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఓటేస్తే తెలంగాణ ను ఆగం బట్టిస్తరనే అభిప్రాయం కూడా ప్రజల్లో నాటుకుపోయింది . తెలంగాణ పూర్తి స్థాయిలో బాగుపడాలంటే కనీసం ఇంకో పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉంటేనే మంచిదని రాజకీయాల్లో కాస్త తటస్థంగా ఉండేవాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నరు . ఎలాగూ టి ఆర్ ఎస్ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి తెలంగాణ లో ఇతర పార్టీలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat