రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు.కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయల ను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి బీభత్సం తో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయినందున, దేశం అంతా కేరళ కి అండగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దేశంలో ఎవరికి ఇబ్బంది, కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే ద్యైర్యం వారిలో కల్పించాలని ఆయన సూచించారు. కేరళ ప్రజలు వెంట మేము ఉన్నామని వారు భయపడే పని లేదని ఆయన తెలిపారు. కేరళ కి విద్యుత్ స్థంబాలు, కరెంటు మీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపుతున్నామని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.