మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద చెరువు ఒకప్పుడు కనీస రాకపోకలకు కూడా ఉపయోగ పడని స్థాయి నుండి అంచలంచలుగా అభివృద్ధి చేసి ట్యాంక్ బండ్ గా తీర్చి దిద్దడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ బండ్ ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు మాదిరిగా ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ గారిని మహబూబ్ నగర్ పర్యటనలో కోరడం జరిగింది. అందుకుగాను మహబూబ్ నగర్ లో నక్లేస్ రోడ్డు నిర్మాణం కు గాను రూ.24కోట్ల విడుదల చేయడం జరిగింది. నక్లేస్ రోడ్డు నిర్మాణం ద్వారా న్యూ టౌన్, బస్ స్టాండ్ మరియు మోటల్ లైన్ రోడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ట్యాంక్ బండ్ నక్లేస్ రోడ్డు గా పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు.