ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని , అలసిపోయి ,కూర్చున్న ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఎర్లాకులం జిల్లా కలెక్టర్ రాజమానిక్యం….బాధితులకు అండగా నిలిచి, సహాయక కార్యక్రమంలో తాను కూడా ఒక సామాన్యుడిగా పనిచేసి శభాష్ అనిపించు కున్నారు .కేరళలో వరద భీభత్సానికి గురైన పలు ప్రాంతాల్లో ఆర్మీ, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ తదితర సంస్థలకు చెందిన జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా కేరళకు చెందిన ఐఎఎస్ అధికారులు కూడా స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద నీటిలో మునిగిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, వరద బాధితుల కోసం వచ్చిన బియ్యపు సంచులను లారీలనుంచి దింపి పునరావాస కేంద్రాల్లోకి చేర్చడంలోనూ వారు పాలుపంచుకున్నారు.ఈ రోజులలో ప్యాంటు,షర్టు తీసేసి టీ షర్టు,నిక్కరుతో ఇలా బురదతో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా పనిచేయరు. ఇలాంటి మంచి వ్యక్తిని అభినందించేవారంతా షేర్ చేసి మద్దతివ్వండి
