Home / NATIONAL / కేరళ వరద విరాళాలను నకిలీ అకౌంట్స్ కి తరలింపు..జాగ్రత్త

కేరళ వరద విరాళాలను నకిలీ అకౌంట్స్ కి తరలింపు..జాగ్రత్త

కేరళ వరద సంబంధిత విరాళాలను దోచుకోవడానికి కేటుగాళ్లు సిద్ధమైయారు. ఎస్‌బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకుప్రయత్నిస్తునారు. అయితే ఎట్టకేలకు ఈ అక్రమానికి అధికారులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేరళ సీఎం ‘డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్’ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్‌బీఐ ప్రతినిధి వెల్లడించారు. ఖాతా నంబర్ 20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అయింది. అయితే ఈ అకౌంట్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకు బ్రాంచ్‌గా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ ఖాతాలో రెండువేల రూపాయలు మాత్రమే ఉన్నాయని,ఇప్పటికే ఈ ఖాతా బ్లాక్‌ చేసామని ఇంక ఎలాంటి లావాదేవీలు సాధ్యంకాదని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు.నిజమైన ఖాతా 67319948232 ఇది ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. మరోవైపు తప్పుడు సందేశాలు,పోస్టలు సోషల్ మీడియా లో కనిపించడంతో జాగ్రతగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి ప్రజలకు సూచించింది. అలాగే సైబర్ నేరస్థులపై చర్యలు తెలుసుకోవాలని పోలిసుసులను ఆదేశించారు.
విరాళాలు పంపాల్సిన అసలైన బ్యాంకు ఖాతా, చిరునామా:
లబ్ధిదారుపేరు:ప్రిన్సిపల్కార్యదర్శి(ఫిన్),కోశాధికారి,సీఎండీఆర్‌ఎఫ్‌
బ్యాంకుపేరు:ఎస్‌బీఐ
ఖాతాసంఖ్య:67319948232
శాఖ:సిటీబ్రాంచ్,తిరువనంతపురం
IFSC: SBIN0070028
అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎస్‌బీఐతో పాటు పేటిమ్, భీమ్‌, తేజ్, ఫోన్ పే వంటి యునిఫైడ్ చెల్లింపు ద్వారా కూడా సహాయం చేయ్యవచ్చు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat