ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణివైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు అన్ని వర్గాల నుండి ఆదరణ లభిస్తున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కట్టనున్నారు అని పలు సర్వేలు తేల్చడంతో మాజీ కేంద్ర మంత్రి అయిన కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున రెండు సార్లు ఎంపీగా బరిలోకి దిగిన కానీ టీడీపీ సీనియర్ దివంగత మాజీ ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు మీద బంపర్ మెజార్టీతో 2009ఎన్నికల్లో గెలుపొంది కేంద్రమంత్రి పదవిని చేపట్టారు..ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనమవ్వగా అడదపాడద ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గోంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు అని చిక్కోల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ప్రచారం జరుగుతుంది..