కేరళలో త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. తాజాగా నావికాదళం చూపిన సమయస్పూర్తి, తెగువకు 26 మంది ప్రాణాలను కాపాడింది. పైలెట్ చిన్న ఏమాత్రం ఆదమరిచినా సెకన్లలో హెలికాప్టర్ తునాతునకలైపోవడమే కాదు, 26మందితోపాటు మరో ఐదుగురు ఆర్మీ వారి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. ప్రస్తుతం సినిమా దృశ్యంలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సైన్యం ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛాలాకుడే ప్రాతంలో ఓ ఇంట్లో 26 మంది చిక్కుకున్నారు. కనసీం బయట అడుగుపెట్టడానికే వీలులేదు. దీంతో నేవీ సిబ్బంది హెలీకాప్టర్‌తో వెళ్లారు. కానీ అక్కడ హెలికాప్టర్ దిగేందుకే చోటులేదు. వారిదగ్గర సరైన తాడులేదు దీంతో 33 ఏళ్ల పైలెట్ చాలా పెద్ద సాహసం చేశాడు. ఇంటి పైకప్పుమీదే హెలికాప్టర్ దించేశాడు. 26 మందిని హెలికాప్టర్‌లోకి ఎక్కించి వెంటనే హెలీకాప్టర్ రయ్‌మంటూ గాల్లోకి ఎగిరింది. ఇంటి పైకప్పుపై చాలీచాలని చోటులో హెలికాప్టర్ దించడం చాలా పెద్ద రిస్క్ కానీ కష్టాల్లో ఉన్నవారిని రక్షించాలని మాత్రమే ఆ సమయంలో తాను అనుకుని అంతటి సాహసానికి దిగామని, టీమ్ సభ్యులంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయంతోనే ఈ సాహసం చేసినట్టు నట్టు లెఫ్టినెంట్ కమాండర్ అభిజీత్ గరుడ్ వెల్లడించారు. 26 మందిని హెలికాప్టర్‌లోకి తీసుకురావడం కత్తిమీద సామేనన్నారు. పైలెట్ ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా పరిస్థితి మరోలా ఉండేదని, ఆ సమయంలో పైలెట్ నిర్ణయం సరైందేనని అనిపించిందని చెప్పారు. తాము రక్షించిన వారిలో 80 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారని తెలిపారు. హెలికాప్టర్‌లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ (కో-పైలెట్), లెఫ్టినెంట్ సత్యార్థ్ (నావిగేటర్), అజిత్ (వించ్ ఆపరేటర్), రాజన్ (ఫ్రీ డైవర్) ఉన్నట్టు పైలెట్ వెల్లడించారు. ప్రాణాలకు తెగించి కాపాడిన వీరందరినీ దేశం మొత్తం కొనియాడుతోంది.
Yup. We can land just about anywhere. That's a @indiannavy Seaking 42B on a narrow rooftop evacuating people in #KeralaFlood The story gets even more amazing. (See my next tweet) pic.twitter.com/3GPg2JC0ra
— Shreya Dhoundial (@shreyadhoundial) August 18, 2018