కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 లక్షలు విరాళం అందించారు. అందులో రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి, మిగతా రూ.5 లక్షలు రిలీఫ్ మెటీరియల్ కొనడానికి కీర్తి సురేశ్ అందించారు. ఆహారం, బట్టలు, మెడిసిన్ వంటివి స్వయంగా కొని తీసుకెళ్లి బాధితులకు అందించింది కీర్తి. అలాగే ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసానిచ్చింది. తన అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరింది. అలాగే అందరూ ముందుకు వచ్చి సాయం చేయాలని కోరింది. కేవలం డబ్బునివ్వడమే కాకుండా వారికి ధైర్యాన్నిస్తూ, సేవ చేస్తూ మంచి మనసుని చాటుకుంది. ఇవన్నీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. స్టార్ గా ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత ప్రాంతాన్ని మర్చిపోని కీర్తి సురేష్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.. కీర్తి ఎంత అందంగా ఉంటుందో తన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని ప్రశంసిస్తున్నారు.
