వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజుకు చేరుకుంది.. జగన్ కు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దాదాపుగా చివరి దశకు పాదయాత్ర చేరుకుంది. ముండుటెండల్లో సైతం పాదయాత్ర జరిగింది.. అయితే తాజాగా మంత్రి అయ్యన పాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో కూడా జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇసుక వేస్తె రాలనంత జనాలు రావడం, వారిలో కొందరు గొడుగు తీసుకొని రావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా గంటలపాటు జగన్ రాకకోసం వేచి ఉంటూ జగన్ మాటలు వినడానికి వర్షంలో కూడా నిలబడి ఉన్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సభల్లో వేదిక ముందు కుర్చీలు వేసి, టెంట్లు వేసి భారీ హంగామా చేసినా, వారికి వాహనాలు పెట్టి, భోజనాలు, ఫలహారాలు పెట్టి డబ్బులిచ్చినా జనం రావడం లేదు.. ప్రస్తుతం ఈ చిన్న రెండు తారతమ్యాలు చూసిన టీడీపీ నేతలే జగన్ ఆదరణను చూసి ఆశ్చర్యపోతున్నారు.
