దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సాగిన బిగ్‌బాస్ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ, పూజ, తనీష్, కౌశల్‌లో మరి తనీష్, కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అయితే ఈ వారం మొదటి డబల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సమచారం. నామినేషన్ జాబితాలో ఉన్న కౌశల్ ఎలాగూ ఫైనల్ వరకూ ఉంటాడు. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి.. అతను వెళ్లే ప్రసక్తే లేదు. కౌశల్ ఆర్మీనే కాకుండా.. ప్రతి ఇంటిలోనూ కౌశల్ కు అభిమానులున్నారు. ఈ వారం వచ్చే ఓట్లలో 80శాతం కౌశల్ కే ఉండబోతున్నాయని.. ఇప్పటికే అనేక ఆన్ లైన్ సర్వేలు వెళ్లడిస్తున్నాయి. మిగతా 20శాతం ఓట్లలో ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ వస్తే.. వాళ్లు ఉంటారు. తనీష్‌పై సోషల్ మీడియాలో నెగెటివిటి ఉన్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి.. దీప్తి చేసే చేష్టలకు, అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. పూజకు మరీ అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి తను కూడా వెళ్లే అవకాశమూ ఉంది. ప్రస్తుతం ఈ నలుగురిలో తనీష్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్ కన్నా దీప్తి వెనుకంజలో ఉన్నారు. ఈ వారం డబల్ ఎలిమినేషన్లో పూజ రామచంద్రన్ , దీప్తి వెళ్లిపోనున్నారని తెలుస్తుంది. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.
