పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి.
తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే ముందుండే వ్యక్తి… కష్టం అని తన దగ్గరకు వస్తే పెదాలపై చిరునవ్వును తెప్పించి మరి సమస్యను పరిష్కరించే మంచి మనస్సున్న ఎమ్మెల్యే అతను. అతనే వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్. ఎమ్మెల్యే అరూరి రమేష్ కు ఈ విషయం తెలియగానే చలించిపోయి అరూరి గట్టు మల్లు మెమోరియల్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.
నిర్ణయించుకున్న తడవు వెంటనే ముప్పై వేల రూపాయలను అందించారు. అంతే కాకుండా ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఐదేండ్ల పాటు ప్రతి ఏడాదికి ముప్పై వేల రూపాయలను ఇస్తాను అని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే.హార్షిణీ తల్లిదండ్రులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న తమకు ,తమ బిడ్డకు అండగా ఉండటానికి ముందుకోచ్చిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు..