ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు ఆయనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ. ఈ నేపథ్యంలో గత పన్నెండు రోజులుగా భారీ వర్షాలతో,తీవ్రమైన వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే.. వరదలతో ,వర్షాలతో అనాధికారంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా..
దాదాపు నాలుగు లక్షల మంది నిరాశ్రయులైనారు సమాచారం. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కేరళకు అపన్నహస్తమందిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు రూ.25కోట్లు సాయం ,మరో రూ.2.50కోట్ల విలువ చేసే ROమిషన్లు,రూ52.5లక్షల విలువ చేసే బాలామృతం ,50టన్నుల పాలపోడి అందజేయాలని అధికారులను ఆదేశించారు..తాజాగా 500టన్నుల బియ్యాన్ని పంపాలని కూడా సీఎం ఆదేశాలను జారీచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ నడుస్తూ ఎంతోమంది కేరళలో వరదలలో చిక్కుకుని చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. వారందరికీ మనం ఆపన్నహస్తం అందించి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది . ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపుకి స్పందనగా ఆయన వంతు సహాయంగా Rs .5,00,000 విరాళం కేరళ అసోసియేషన్ సభ్యుల మధ్య కేరళ CMRDF నిధికి అందించి దేశంలోని ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు,ప్రజలు ముందుకురావాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్ (124డివిజన్ వార్డ్ మెంబర్,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత),పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గోన్నారు..