వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వద్దకు రామచంద్రరావు, బలరామ్మూర్తిని తీసుకుని వెళ్లి ఉమాశంకర్ పరిచయం చేశారు. వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
కాంగ్రెస్‌కు చెందిన 100 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రుత్తల వెంకటేశ్వరరావు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాచపల్లి పంచాయతీ పరిధిలోని యరకన్నపాలెం, ధర్మవరం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన 100 మంది తన అనుచరులతో కలసి ఆదివారం మండలంలోని చంద్రయ్యపాలెం మీదుగా సాగిన సంకల్పయాత్రలో వైసీపీలో చేరారు. నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నేత రుత్తల యర్రాపాత్రుడు సమక్షంలో వైఎస్ జగన్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రుత్తల సత్యనారాయణ, ఆర్.వి.ఎస్.ప్రసాద్, అడిగర్ల కృష్ణ, గండి పైడన్న, సత్తిబాబు తదితరులు ఉన్నారు.