ఏపీ ప్రతిపక్షనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్ రోడ్ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోట ఉరట్ల, కైలాసపట్నం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం కోట ఉరట్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
