తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద నిత్యం బురద చల్లడానికి ముందుండే ప్రతిపక్షాలు,సోషల్ మీడియాలో వ్యతిరేకులు భార్య ఒక్కరే కానీ భర్తలు ఇద్దరూ.. ఈ బిడ్డకు తండ్రి ఎవరో అంటూ బెంగ పెట్టుకున్నాడు అంటూ పలు ఆరోపణలు,విమర్శలు చేసిన సంగతి తెల్సిందే.
అయితే ఈ వివాదంపై ఐఎన్ పి ఆర్ విభాగం యాడ్ ఏజెన్సీకి నోటీసులు జారిచేసింది. ఈనోటీసులు అందుకున్న సదరు యాడ్ ఏజెన్సీ సదరు యువతి అంగీకారం ప్రకారమే ప్రకటన ఇచ్చామని చెబుతూ సదరు యువతి అంగీకార పత్రాన్ని విడుదల చేసింది.. మీరు ఒక లుక్ వేయండి..