ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు.
డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మాట్లాడాలని ఆయన వ్యాఖ్యానించారు. తాము నెరవేర్చని హామీ ఒక్కటయినా ఉందా అని ప్రశ్నించారు.
కార్లో నోట్ల కట్టలతో దొరికింది ఉత్తమ్ కాదా అని కిశోర్ కుమార్ ప్రశ్నించారు. ఉత్తమ్‌కు ఓట్లేసి గెలిపించుకోవడం హుజుర్ నగర్ ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. `కేటీఆర్ ఏ అంశంలోనైనా ఉత్తమ్ సరి తూగగలరా? సబ్జెక్టు సిద్ధంగా లేదని అసెంబ్లీ చర్చ నుంచి పారిపోయిన వ్యక్తి ఉత్తమ్. ఉత్తమ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు ఆపక పొతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు “ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. కాంగ్రెస్‌లాగా సోనియాను తాము ఇటలీ నుంచి దిగుమతి చేసుకోలేదని, కేసీఆర్ ప్రజల నుంచి ఉద్యమం నుంచి వచ్చారన్నారు.
Post Views: 316