పర్యావరణపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎక్కడైనా కేరళ తరహా ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. ప్రస్తుతం గోవా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వేగలోని అంశాల ఆధారంగా గోవాపై విస్తృతంగా చర్చ జరిగింది. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేరళలలాగా అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు గోవాలో లేకపోయినా గోవాలో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని కేరళను అతలాకుతలం చేసిన వరదలను గుర్తుచేస్తూ గాడ్గిల్ పేర్కొన్నారు. వ్యాపార లాభాలపై ఉన్న తాపత్రయంతో స్వార్థంతో పర్యావరణాన్ని కాపాడకపోవడమే ఈ అనర్ధాలకు కారణమని గాడ్గిల్ వ్యాఖ్యానించారు. గోవాలో అక్రమ మైనింగ్‌తో రూ 35,000 కోట్లు అక్రమంగా ఆర్జించారని కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ వెల్లడించిందని గాడ్గిల్ గుర్తుచేశారు. పర్యావరణ నిబంధనల అమలును ప్రభుత్వాలు పాటించకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయగ్రీన్‌ట్రిబ్యునల్ సక్రమంగా పనిచేయకుండా కేంద్రప్రభుత్వం దాని వెన్నువిరుస్తోండడమే అనర్ధాలకు కారణమవుతుందని, దన్నారు. మైనింగ్ కంపెనీలు పర్యావరణ ప్రభావ అంచనాపై నివేదికల్లో తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ఇకనైనా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రప్రభుత్వం పర్యావరణానికి ప్రతికూలతలు తెచ్చే విధానాలను మానుకుని, గ్రీన్ ట్రిబ్యునల్ కు అనుగుణంగా పనిచేయాలని కోరారు.
Home / NATIONAL / అలా చేయకపోతే గోవానే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇదే దుస్థితి.. ఇకనైనా మేల్కొందాం..!
Tags all states country gova worried ..
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023