అధికార టీఆర్ ఎస్ పార్టీ లోకి వలసలు జోరందుకున్నాయి .కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 125,126,127,129,132 డివిజన్ లకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు వారందరికి గులాబి కండువ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ అనంతరం వారు మాట్లాడుతూ. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో నేడు జరుగుతున్న అభివృద్ధి పనులు ,మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలు అధరిస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దే నిదర్శనమని.. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ స్వప్నంలో భాగస్వాములై అభివృద్దిలో పాలు పంచుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ లో చేరినట్లు తెలిపారు.
