తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు..
యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన పలువురు ఈ సదావాకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు..పాస్ పోర్ట్ ,ఎలాంటి పత్రాలు లేకుండా ఆ దేశంలో నివసిస్తున్నవారు మూడు నెలల క్షమాబిక్ష కాలంలో యూఏఈని వదిలి తెలంగాణకు రావచ్చని చెప్పారు.
ఇందుకు యూఏఈలోని భారతరాయభారి కార్యాలయాన్ని సందర్శించాలని ..వారితో సమన్వయం చేస్కోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు..దీనికి సంబంధించి సాయం పొందాలనుకుంటే 94408 54433 హెల్‌లైన్
సెంటర్‌కు ఫోన్ చేసి కానీ so_nri@telangana.gov.in కు ఈమెయిల్ సమాచారం పంపొచ్చని మంత్రి తెలిపారు. యూఏ ఈ కాన్సులేట్‌లోని హెల్ప్‌డెస్క్ +71565 463903 నంబర్, indian.amnesty@gmail.com, indiandubai. amnesty@gmail.com వెబ్‌సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు..