వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే.
అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక విమానంలో కేరళకు పంపించిన సంగతి విదితమే..దీనికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖను రాశారు..