భారతీయ నావికాదళం చూపిన ధైర్యం 26మంది ప్రాణాలను కాపాడింది. వారు సెకను ఆలస్యం చేసినా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. చాలకుడిలోని ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మందిని నాటకీయ పరిణామాల మధ్య నావికాదళం కాపాడింది. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్ 42బీ హెలికాప్టర్‌తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్‌ను ఎక్కడ దించాలో పైలెట్‌కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వరద బాధితులు చిక్కుకుపోయిన ఇంటిపైనే ఎంతో జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. ఇలాంటి సందర్భంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా హెలికాప్టర్ ముక్కలైపోయేది. ఇంటిపైన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే, చకచకా 26మందిని అందులోకి ఎక్కించి, అంతే ఒడుపుగా దాన్ని గాల్లోకి లేపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముఖ్యంగా పైలెట్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. క్రింది వీడియో చూడండి.
Yup. We can land just about anywhere. That's a @indiannavy Seaking 42B on a narrow rooftop evacuating people in #KeralaFlood The story gets even more amazing. (See my next tweet) pic.twitter.com/3GPg2JC0ra
— Shreya Dhoundial (@shreyadhoundial) August 18, 2018