టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో భాగంగా గీత గోవిందం బాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్ షాకిచ్చే విధంగా కలెక్షన్ల సునామీను సృష్టించింది.. ఇప్పటివరకు అమెరికాలో 1.5మిలియన్ డాలర్లను కలెక్టు చేసింది..
ఇక ఆస్ట్రేలియాలో అయితే మాత్రం ఏకంగా బాలీవుడ్ కు బిగ్ షాకిస్తూ రెండు లక్షల డాలర్లకు పైగా వసూళ్ళను రాబట్టింది..ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీలు అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్,జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన సత్యమేవ జయతే సినిమాలు రెండు కల్సి 1.92లక్షల డాలర్లను వసూళ్ళు చేయగా గీతగోవిందం మాత్రం రెండు లక్షల డాలర్లను వసూళ్ళను చేయడంతో కంగుతినడం బాలీవుడ్ వంతైంది..