జగ్జీవన్ రామ్, జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ వీరంతా మహానుభావులు.. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు.. అయితే ఇప్పుడు వారి కోవలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు మీకు తెలుసా ఈవిషయం జగ్జీవన్ జయంతి సభలో చంద్రబాబే స్వయంగా చెప్పారు కూడా వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో అందరూ మహానుభావులు పుట్టారు. జగ్జీవన్ రామ్ (ఏప్రిల్ 5), పూలే (ఏప్రిల్ 11), అంబేడ్కర్(ఏప్రిల్ 14) అని చెబుతుండగా వేదిక మీద ఉన్న చంద్రబాబును పొగిడేవాళ్లు, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సార్.. మీరు కూడా ఏప్రిల్ నెలలోనే పుట్టారని చెప్పారు. దానికి సీఎంగారు సరే అని కట్ చేయకుండా.. వెంటనే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటు “మావాళ్ళు కూడా చెబుతున్నారు నేను కూడా ఇదే నెలలో (ఎప్రిల్ 20) పుట్టానని” అన్నారు. పోనీ అంతటితో ఆగకుండా చాలా ఆవేశంగా నేనుసైతం ఆమహానుభావుల్లాగా నాజీవితాన్ని కూడా ప్రజలకోసమే అంకితం చేస్తానంటూ బీరాలు పలికారు. అయితే ఇప్పటినుంచి పచ్చపార్టీ నాయకులకు ఎవరు అవునన్నా కాదన్నా జగ్జీవన్ రామ్, పూలే, అంబేడ్కర్ తో పాటుగా చంద్రబాబు కూడా మహానుభావుడే. మహనీయుడేనన్నమాట.. అయితే అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులు, పార్టీలోని కొందరు పెద్దలు మాత్రం పిచ్చి మరింత ముదిరిపోయిందని, నవ్వుకున్నారు.
