గుంటూరు జిల్లా పల్నాడులో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రకభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా జగన్ ఓ లేఖ రాసారు. ఈ వివాదంలో అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈకేసు అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నంత చేస్తున్నారని జగన్ అన్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోందన్నా రు.
రోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించేశారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ్వవరికీ తెలియదని అనుకోవాలా? ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా.. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది? మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది.. మాకు సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు.
సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారని, గనుల దోపిడీ వ్యవహారంలో అలాంటి వ్యక్తి సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని, ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయన్నారు జగన్.