కేరళ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అండగా నిలిచారు.గత పది రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాల కారణంగా సుమారు ఇప్పటివరకు 400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అంతేకాకుండాకొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25 కోట్ల ప్రకటించారు.ఆ మొత్తాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రి నాయిని నరసింహా రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. నెల వేతనం విరాళంగా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎంపీలు నిర్ణయించారు. నెల జీతాన్ని సీఎం రిలీఫ్ పండ్‌కు అందించనున్నారు.